వారాహి మాత ఆలయానికి అంకురార్పణ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్ రెసిడెన్షియల్ ఏరియాలో వారాహి మాత ఆలయానికి అంకురార్పణ క్రతువును ఆదివారం నిర్వహించారు. మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. అమ్మ వెంచర్ కమిటీ బాధ్యులు పూర్తి సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆల యం నిర్మించే స్థలాన్ని దున్ని ధాన్యం గింజ లు చల్లారు. ఆవులను కలిచతిప్పారు. బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకుర్పాణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబా ద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయ ణ మాట్లాడుతూ.. పరమ శివుడు స్వ యంగా నిర్మించుకున్న కాశీ నగరానికి గ్రామ దేవతగా ఉన్న వారాహి మాత ఆలయాన్ని నిజామాబాద్ నగరంలో నిర్మించాని సంకల్పించడం సంతోషకరమన్నారు. వారాహిమాత కృప జిల్లా పై ఉంటుందన్నారు. వారాహి మాత ఆలయ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతానికి స్థాన బలం మరింత పెరుగుతుందన్నారు. మంచాల జ్ఞానేందర్ గుప్తా మాట్లాడుతూ.. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన ఆలయ శంకుస్థాపనకు హంపీ పీఠా ధిపతి విద్యారణ్యస్వామి రానున్నారని, కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో అమ్మ వెంచర్ అసోసియేషన్ అధ్యక్షుడు రెంజర్ల నరేశ్, సుదర్శన్, భానుకుమార్, జవ్వాజి దామోదర్, పోశెట్టి, శ్రీకాంత్, అయ్యప్ప దీక్షాపరులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment