పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీలను నియమించాలని నిర్ణయించింది. అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా, నిజామాబాద్ నగర పాలకసంస్థ పరిధిలో మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. సర్వేతోపాటు కమిటీల నియామకం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సైతం ఈనెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కమిటీల నియామకం జాడలేకుండాపోయింది. మరోవైపు వచ్చే జనవరి 26వ తేదీతో కార్పొరేటర్ల పదవీ కాలం పూర్తి కానుంది.
Comments
Please login to add a commentAdd a comment