గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
బాల్కొండ: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామ చెరువులో శనివారం గల్లంతైన కోటగిరి మండలం కొత్తపల్లికి చెందిన గేదెల కాపరి చిన్నసాయిలు (40) మృతదేహం ఆదివారం లభ్యమైంది. స్థానిక జాలరుల చేత గాలింపు చర్యలు చేపట్టగా నీట మునిగిన చోటే మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై రజనీకాంత్ పేర్కొన్నారు.
టేకు దుంగల పట్టివేత
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజ్ పరిధిలోని వెల్లుట్లలో అక్రమంగా దాచి ఉంచిన టేకు దుంగలను కామారెడ్డి అటవీశాఖ ప్రత్యేక బృందం అధికారులు దాడులు చేసి పట్టుకున్నట్లు ఎఫ్‌డీవో రామకృష్ణ ఆదివారం తెలిపారు. వెల్లుట్లలో అక్రమంగా టేకు దుంగలు దాచి ఉంచారన్న సమాచారం మేరకు కామారెడ్డి బృందం దాడులు చేయగా గ్రామంలోని పైడాకుల నర్సింలు అనే వ్యక్తి ఇంట్లో దాచి ఉంచిన 50 టేకు దుంగలను స్వాధీనం చేసుకుని ఎల్లారెడ్డి అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. నర్సింలుపై అటవీశాఖ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌డీవో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment