ఎస్‌హెచ్‌జీ మహిళలకు యూనిఫామ్!
డొంకేశ్వర్(ఆర్మూర్): స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు యూనిఫామ్(చీరలు) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చీరల డిజైన్, రంగును ఖరారు చేసిన ప్రభుత్వం వాటిని రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ద్వారా తయారు చేయిస్తోంది. లేత నీలం రంగులో ఉన్న చీరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన బార్డర్ ఉండనుంది. వీటిని కొత్త ఏడాదిలో ఎస్‌హెచ్‌జీ మహిళలకు ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశముంది. ఒక్కో సభ్యురాలికి ఏడాదికి రెండు చొప్పున చీరలు ఇవ్వనున్నారు. ఇప్పటి వర కు జిల్లా, మండల సమాఖ్య అధ్యక్షులతోపాటు వీ వో అధ్యక్షులకు మాత్రమే ఉన్న డ్రెస్ కోడ్ విధానం ఎస్‌హెచ్‌జీలకు వర్తింపజేయడం ఇదే తొలిసారి. జిల్లాలో 28 మండల సమాఖ్యలు ఉండగా 806 వీ వోలు, 23,753 ఎస్‌హెచ్‌జీ సంఘాలు, 2.51లక్షల మంది సభ్యులున్నారు. ఒక్కో గ్రూపు పరిధిలో 8నుంచి 15మంది సభ్యుల వరకు ఉంటారు. వీరు పొదుపును చేసుకుంటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను పొందుతున్నారు. తీసుకున్న రుణాలను ఇంటి అవసరాలు, వ్యాపారాలకు ఉపయోగించి స్వయం ఉపాధిని పొందుతున్నారు. జిల్లాలో కొన్ని ఎస్‌హెచ్‌జీలు ధాన్యం కొనుగోలు సైతం చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నాయి. ఇలాంటి మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా ప్రభుత్వం యూనిఫామ్ విధానా న్ని ప్రవేశపెట్టింది. నెలకోసారి గ్రామాల్లో నిర్వహించుకునే సమావేశాలకు మహిళలు యూనిఫామ్‌తోనే రావాలని నిబంధన పెట్టనుంది.
త్వరలో చీరలు పంపిణీ
చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఏడాదికి రెండు చొప్పున
ఇవ్వాలని నిర్ణయం
జిల్లాలో 2.51లక్షల మంది సభ్యులు
వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం
మహిళా సంఘాల సభ్యులకు డ్రెస్ కోడ్ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని త్వరలోనే పంపిణీ చేసే అవకాశముంది. జిల్లాకు వచ్చిన వెంటనే మండలాలకు చేరుస్తాం. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం వాటిని సభ్యురాలకు అందజేస్తాం. – సాయాగౌడ్, డీఆర్‌డీవో, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment