కాకాకు ఘన నివాళి
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని కలెక్టరేట్‌లో కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత వెంకటస్వామి (కాకా) వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కాకా చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర మాజీ మంత్రి గడ్డ వెంకటస్వామి బడుగు బలహీనుల కోసం విశేషంగ కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంఽగధర్, నుడా చైర్మన్ కేశవేణు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
సీపీ కార్యాలయంలో ..
ఖలీల్‌వాడి: నగరంలోని సీపీ కార్యాలయంలో ఆదివారం కేంద్ర మాజీ మంత్రి దివంగత నాయకుడు కాకా వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కాకా చిత్రపటానికి డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. డీసీపీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు కాకా అని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలు అన్ని దశల్లోనూ స్ఫూర్తిని నిలిపాయన్నారు. సీసీఆర్‌బీ సీఐ సతీష్‌కుమార్, ఎన్‌ఐబీ సీఐ ప్రసాద్, రిజర్వ్ సీఐలు సతీష్ కుమార్, తిరుపతి, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment