కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు చిత్రపరిశ్రమ
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే నాడు మద్రాస్‌లో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు వ చ్చిందని, మాజీ ముఖ్యమంత్రి మర్రి చె న్నారెడ్డి వంటి వారిది ప్రముఖ పాత్ర అని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అ న్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు చిత్రపరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు స్టూడియోల నిర్మా ణాలకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలు ఇచ్చి ప్రోత్సహించిందని గుర్తుచేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారిని ప్రభు త్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని, ఇందులో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని పేర్కొన్నారు.
గుత్ప నీటి విడుదల
నందిపేట్(ఆర్మూర్): రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని యాసంగి పంటల సాగు కోసం గుత్ప నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఉమ్మెడ శివారులో ఉన్న గుత్ప మొదటి పంపుహౌజ్ వద్ద స్విచ్ ఆన్‌చేసి మోటార్ల ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుత్ప ఎత్తిపోతల పరిధిలో ని 34,650 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నందిపేట, మాక్లూర్, ఆలూర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాల పరిధిలోని చివరి ఆయకట్టుకు నీరందే వరకు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని, నాలుగు విడుతలుగా 545 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్లీడర్‌గా
అమిదాల సుదర్శన్
ఖలీల్‌వాడి: డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో ప్ర భుత్వ ప్లీడర్‌గా అమిదా ల సుదర్శన్, జూనియ ర్ సివిల్ జడ్జి కోర్టులో ఏజీపీగా ఎర్రం సదానందం నియమితులయ్యారు. ఈ మేరకు లీగల్, లెజిస్లేటీవ్ ఎఫైర్స్ తిరుపతి ఈనెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. సుదర్శన్, సదానందం మూడేళ్లపాటు ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను వాదిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment