దొంగ లెక్కలు చెప్పొద్దు | - | Sakshi
Sakshi News home page

దొంగ లెక్కలు చెప్పొద్దు

Published Mon, Dec 23 2024 1:23 AM | Last Updated on Mon, Dec 23 2024 1:23 AM

దొంగ

దొంగ లెక్కలు చెప్పొద్దు

మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభం

నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఎదుట నూతనంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి దా మోదర రాజనర్సింహ ఆదివారం ప్రారంభించారు. నాలుగు అంతస్తుల భవనాన్ని ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ప్రారంభించి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మమహేష్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వసలహాదా రు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌సూర్యనారాయణగుప్తా, డాక్టర్‌ భూపతిరెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్‌ కేశ వేణు, కలెక్టర్‌రాజీవ్‌గాంధీ, నగర మేయ ర్‌ నీతూకిరణ్‌, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, అధికారులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌నాగారం: పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభు త్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో వైద్యారోగ్యశాఖ, జీజీహెచ్‌ అధికారులతో ఆదివారం ఉమ్మడి జిల్లా సమీక్షాసమావేశం నిర్వహించారు. అంతకు ముందు సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ పవర్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తాము అందించిన సేవలను వివరించారు. సరైన సౌకర్యాలు లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి కల్పించుకుని.. మీరు చెప్పే నంబర్లను నమ్మబోనని, గాంధీ, వరంగల్‌ ఆస్పత్రులకన్నా ఎక్కువ వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పడం మాను కోవాలని అసహనం వ్యక్తం చేశా రు. మీరు ఏం చేస్తున్నారో తెలుసునని, హైదరాబాద్‌ నుంచి జీజీహెచ్‌కు వచ్చేందుకు వైద్యులు మొగ్గు చూపుతుండడంపై మండిపడ్డారు. ప్రతి రోజూ కేవలం 40శాతం మంది వైద్యులు మాత్రమే విధులకు హాజరువుతున్నారన్నారు. సూపరింటెండెంట్‌గా బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ప్రతిమారాజ్‌కు సూచించారు.

అనంతరం సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. మూడు నెలల్లో జిల్లాలో క్యాన్సర్‌ చికిత్స కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జిల్లాని ప్రతి సబ్‌సెంటర్‌లో పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రి, జీజీహెచ్‌లో కనీసం 85శాతం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి పేదలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన చోట సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ, సదుపాయాల కల్పనపై నిఘా సారించాలన్నారు.

సమాచారం ఇవ్వడం లేదు : ధన్‌పాల్‌

ఏడాదిలో ఒక్కసారి కూడా ఆస్పత్రి డెవలప్‌మెంట్‌ కమిటీ(హెచ్‌డీసీ) సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ప్రశ్నించారు. తన నియోజకవర్గం పరిధిలో జీజీహెచ్‌ ఉన్నప్పటికీ తనకు ఏవిధమైనా సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. సూపరింటెండెంట్‌ ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. హెచ్‌డీసీ ఏర్పాటు చేయాలని సూచించారు.

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రాకేశ్‌రెడ్డి

తాను అడగగానే ఆర్మూర్‌కు 108తోపాటు, అంకాపూర్‌లో పీహెచ్‌సీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై మంత్రి దామోదరకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్టెతస్కోప్‌ వంటి చిన్నచిన్న సామగ్రి ఉండడం లేదని కొంత మంది వైద్య సిబ్బంది చెప్పారని ఎమ్మెల్యే తెలుపగా.. చిన్నచిన్న అవసరాలకు అవసరమైతే ఎమ్మెల్సీ ఫండ్‌ ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్‌ కేశవేణు, డీఎంహెచ్‌వో రాజశ్రీ, వైద్యారోగ్య, జీజీహెచ్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘‘జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి లో ఏం జరుగుతుందో తెలు సు, మీరు నంబర్లను చూపి గొప్పలు చెప్పుకోకండి. నా వద్ద పూర్తి సమాచారం ఉంది. ప్రతి రోజూ 60శాతం మంది వైద్యులు గైర్హాజరవుతున్నా రు. వైద్యులు సమయపాలన పాటించాలి. ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తే చర్యలు తప్పవు. వంద రోజుల్లో మళ్లీ వస్తా.. మార్పు రాకుంటే కఠిన చర్యలు తప్పవు’’. – వైద్యారోగ్యశాఖ ఉమ్మడి జిల్లా సమీక్షాసమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ

నా వద్ద ఆధారాలతో పూర్తి

సమాచారం ఉంది

60శాతం మంది వైద్యులు

గైర్హాజరవుతున్నారు

వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తే

చర్యలు తప్పవు

వందరోజుల్లో మళ్లీ వస్తా..

మార్పు రావాల్సిందే

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు చేయండి

సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ

మంత్రి దామోదర రాజనర్సింహ

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

పనితీరుపై ఆగ్రహం

రూ.7కోట్లు మంజూరు చేస్తా

జీజీహెచ్‌లో పైపులైన్‌ల లీకేజీ, భవనంపై పిచ్చిమొక్కలు, కిటికీలకు అద్దాలు పగిలిపోవడం , లిఫ్ట్‌లు చెడిపోవడం, ఎలుకలు తిరగడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. జీజీహెచ్‌ అధికారుల వినతి మేరకు ఆస్పత్రి అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరు చేస్తామన్నారు. వందరోజుల్లో తాను మళ్లీ వస్తానని గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి ఏడో అంతస్తు వరకు అంతా శుభ్రంగా ఉండాల్సిందేనని అన్నారు. నెల రోజుల్లో జీజీహెచ్‌లో మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దొంగ లెక్కలు చెప్పొద్దు1
1/2

దొంగ లెక్కలు చెప్పొద్దు

దొంగ లెక్కలు చెప్పొద్దు2
2/2

దొంగ లెక్కలు చెప్పొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement