నవోదయ స్కూళ్లకు స్థలం కేటాయించండి
సుభాష్‌నగర్: నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాలకు ఇటీవల కేంద్ర కేబినెట్ మంజూరు చేసిన నవోదయ విద్యాలయాలకు స్థలం కేటాయించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సీఎంను ఆయన నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలి శారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సుమా రు 20 ఎకరాల చొప్పున భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల కోరడంతోపాటు రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను సీఎంకు వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అర్వింద్ వివరించారు. ఆర్వోబీల నిధులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లించిందని, దీంతో సకాలంలో బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బి ల్లులు మంజూరు చేసి, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు. జిల్లాలో ప్రతిపాదిత జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ పనులకు సంబంధించి ఓఎల్‌ఎస్ సర్వేని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి నివేదించాలని కో రారు. జగిత్యాల పట్టణానికి కేంద్రీయ విద్యాల యం సైతం మంజూరయ్యే దశలో ఉందని, ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషించాలని కోరారు. తమ వి జ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment