శ్రీ రామాలయం.. మహిళా ప్రాతినిధ్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆలయ నిర్వహణలో అనేక క్రతువులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్రతువును ఎంతో క్రమపద్ధతితో చేయాలి. గత 39 ఏళ్లుగా ఇందూరు సుభాష్‌నగర్ రామాలయం అత్యంత క్రమశిక్షణతో నిర్వ హిస్తున్న కార్యక్రమాల కారణంగా అందరికీ సుపరిచితమైంది. ముఖ్యంగా ధనుర్మాస ఉత్సవాల నిర్వహణలో ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు కమిటీని ఎన్నుకుని ముందుకు వెళ్తున్నారు. గత రెండేళ్లుగా కార్యవర్గంలో కీలకమైన పదవులన్నీ మహిళలే దక్కించుకున్నారు. వీరు ఆలయంలో క్రతువుల నిర్వహణ విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆలయ చైర్‌పర్సన్‌గా హై కోర్టు న్యాయవాది కె సరళామహేందర్‌రెడ్డి, ప్ర ధాన కార్యదర్శిగా ఎస్ శోభానవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా బి గోదాదేవి, బి ఊర్మిళ, శ్రీదేవి, సంయుక్త కార్యదర్శులుగా ఈగ సబిత, కట్టా రాధారాణి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్ అరుంధతి వ్యవహరిస్తున్నారు. వీరు అత్యంత సమర్థ వంతంగా, శాస్త్రోక్తంగా క్రతువులు నిర్వహిస్తుండడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
● శ్రీరామాలయంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. బీఆర్ గంగారెడ్డి ఫౌండర్ అధ్యక్షుడిగా 1986 ఏప్రిల్ 14న త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి మంగళ శాసనములతో ఆలయం ప్రతిష్ట అయ్యింది. ఇందులో సీతారామలక్ష్మణ స్వాములతోపాటు ఆంజనేయుడు, గరుత్మంతుడు, లక్ష్మీదేవి, గోదాదేవి మూలవిరాట్‌లుగా ఉన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాలు వచ్చే నెల 14 వర కు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం తిరుప్పావై ప్రవచనాలు ఏ ర్పాటు చేస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భా గంగా జనవరి 13న గోదా రంగనాయక కల్యాణం, 14న మకర సంక్రాంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.ప్రతి ఏటా ధనుర్మాస ఉ త్సవాలకు ముందు కార్తీక మాసంలో ప్రత్యే కంగా నెల రోజులపాటు బృందావన పూజలు (తులసీపూజలు) చేస్తున్నారు. ఇందుకోసం ప్ర త్యేకంగా ఆలయ ప్రాంగణంలో బృందావనం పేరిట తులసీవనాన్ని పెంచుతున్నారు. బృందావనం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.
గత రెండేళ్లుగా సమర్థంగా
క్రతువుల నిర్వహణ
ధనుర్మాస ఉత్సవాల్లో ప్రత్యేకత
చాటుకుంటున్న ఆలయం
39 ఏళ్లుగా ప్రతి ఏటా వైభవంగా తులసీ కల్యాణం,
శ్రీగోదా రంగనాయక కల్యాణం
శ్రీరామ పట్టాభిషేకం, బతుకమ్మ ఉత్సవాలు
ఆలయంలో ప్రతి నెలా శ్రీరాముడి పునర్వసు కల్యాణం, ప్రతి శ్రీరామ నవమికి 10 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. రథోత్సవంతోపాటు పట్టాభిషేకం కార్యక్రమాలు ఉంటాయి. దస రా ఉత్సవాలు, పదిరోజులు బతుకమ్మ ఉత్సవాలు చేస్తాం. వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. వచ్చేనెల 10న ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయంలో విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టు, లక్ష్మిదేవి స్వరూపంగా భావించే జమ్మి చెట్టు, శివుని స్వరూపంగా భావించే ఉసి రి చెట్టుకు భక్తులు నిత్య పూజలు ఉంటాయి. ఈ నెల 31న నాయిగనాయి ఉత్సవం, వచ్చే జనవరి 2న లక్ష్మీదేవి వైభవ విశేషము, 7న సింహాసనం పాట్టు, 8న దీపోత్సవం, 10న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం, లక్ష పుష్పార్చన, 11న కూడారై ఉత్సవం, 12న అన్నకూటోత్సవం(కదంబం), 13న ఉలుక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. – కె సరళామహేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్‌పర్సన్
అందరి సహకారంతో..
భక్తుల సహకారంతో ఆలయంలో అన్ని సేవలను, క్రతువులను నిర్వహిస్తున్నాం. కార్యవర్గ సభ్యులందరూ సమష్టి బాధ్య తతో క్రమపద్ధతితో వ్యవహరిస్తున్నారు. ఆలయంలో పొంగలి, దద్దోజనం, పులిహోర, సిరా, కుడారై భోగం, కదంబం, ధనుర్మాస రోజువారి పుష్ప కై ంకర్యం, ధనుర్మాస ప్రసాదం కోసం దొప్పలు, దీపోత్సవం, ఆహ్వాన పత్రికలు, వస్త్రములు, లక్ష పుష్పార్చన, గోదా కల్యాణం రోజు అన్నదానం తదితరాలకు 42 దాతల కుటుంబాలు నిరంతరం సహకరిస్తున్నాయి. ఽప్రత్యేకంగా ధనుర్మాస ఉత్సవాలకు కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్నాం.
– ఎస్ శోభానవీన్‌రెడ్డి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment