గుండె పోటుతో మాధవరావు మృతి
ఖలీల్‌వాడి: ప్రముఖ న్యాయ వాది గొర్రెపాటి మాధవరా వు (67) శనివారం నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రి లో గుండెపోటుతో చికి త్స పొందుతూ మృతి చెందారు. జీవిత కాలం ఆయన మాన వ హక్కులు, పౌరహక్కుల కోసం పోరాటం చేశారు. పేదల తరఫున, ఉద్యమ కేసులను ఉచితంగా వాదించేవారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు, విద్యార్థులపై పెట్టిన కేసులపై వాదించి ఉద్యమానికి సహకారంగా అందించారు. లా పూర్తి చేసిన తర్వాత చాలా మంది అప్రెంటిస్ చేసేవారికి గొర్రెపాటి మాధవరావు కేసులకు సంబంధించిన వివరాలను వాటిని ఎలా ఫేస్ చేయాలో వివరించేవారు. పోలీసుల రెండు బూట కపు ఎన్‌కౌంటర్‌లపై కోర్టులో కేసులు వేసి దేశ చరిత్రలో నిలిచారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇప్పించారు. మరొక వ్యక్తిని దొంగతనం కేసులో బూటకపు ఎన్‌కౌంటర్ చేస్తే బాధితుల తరఫున వాదించి రూ. లక్ష ష్టపరిహారం ఇప్పించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
● నగరంలోని ద్వారకా నగర్, శ్రామిక నగర్ గూడెంలలోని గుడిసె వాసులకు, కోటగల్లీ వాసుల ఇంటి స్థలాల కోసం పోరాడి పట్టాలు ఇప్పించారు. ఉద్య మకారులపై పెట్టిన ఔరంగాబాద్ కుట్ర కేసు వాదించి గెలిచారు. మాధవరావుకు ప్రభుత్వ ప్లీడరుగా అవకాశం వచ్చినా తిరస్కరించి, బాధితుల తరఫున న్యాయవాదిగా పని చేశారు. పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 1983 నుంచి 1996 వరకు పని చేశారు. హక్కుల నేత బాలగోపాల్‌తో కలిసి 2004 నుంచి మానవహక్కుల వేదికలో భాగస్వామ్యం అయ్యారు. మానవహక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర మొదటి అధ్యక్షుడిగా 2019 నుంచి 2023గా పని చేశారు. హక్కులకు భంగం కలిగిన ప్రతి చోటా నిజనిర్ధారణ కమిటీలు వేసి నివేదికలు రాసేవారు. నిజామాబాద్‌లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ స్మృతిలో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. అనేక పత్రికలకు వ్యాసాలు, పుస్తకాలు రాశారు. అనేక ప్రజాసంఘాల కార్యకర్తలకు తరగతులు బోధించారు. తెలంగాణ యూనివర్సిటీలో మొదటి తరం న్యాయశాస్త్ర విద్యార్థులకు తరగతులు బోధించారు.
● గొర్రెపాటి మాధవరావు రచనలు పదునైనవి. ముఖ్యమైన రచనలు ఆచరణలో గతి తర్కం (డిడి కోశాంబీ రాసింది తెలుగులోకి అనువాదం), కార్మిక చట్టాలు, ఆధునిక చైనా విప్లవం, విశ్వ మానవ హక్కుల ప్రకటన (ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పత్రం తెలుగులోకి), జాతీయత లేని జాతీ య కాంగ్రెస్ ( తెలుగు అనువాదం) చేశారు.
● మాధవరావు పార్థివ దేహాన్ని ఆదివారం నిజామాబాద్ మెడికల్ కళాశాలకు, కళ్లను లయన్స్ క్లబ్‌కు అందించనున్నారు. అంతకు ముందు ఉ దయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని కోటగల్లీ నుంచి గొర్రెపాటి మాధవరావు పార్థివ దేహం యాత్ర ఉంటుంది. గొర్రెపాటి మాధవరావు పార్థివ దేహానికి మానవహక్కుల వేదిక నాయకులు వసంతలక్ష్మి, శాస్త్రవేత్త బాబూరావు, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, వేల్పూరు భూమయ్య, పరుచూరి శ్రీధర్, బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్‌మోహన్‌గౌడ్, పౌరహక్కుల సంఘం నాయకులు వాల్గొట్ రవీందర్, వి. సంఘం, కొంగర శ్రీనివాస్‌రావు తది తరులు నివాళులు అర్పించారు.
హక్కుల నేతగా పేరుపొందిన
ప్రముఖ న్యాయవాది
బూటకపు ఎన్‌కౌంటర్‌లపై కేసులు వేసి దేశ చరిత్రలో నిలిచారు
పేదలు, ఉద్యమ కారులకు ఉచిత
న్యాయ సేవలు అందించారు
నివాళులు అర్పించిన మానవహక్కుల వేదిక, వామపక్షాల నేతలు
Comments
Please login to add a commentAdd a comment