ముదిరాజ్‌లు రాజకీయంగా చైతన్యం కావాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా చైతన్యం కావాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. శనివారం డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో 14.7 శాతం ఉన్న ముదిరాజ్ లకు చట్టసభల్లో, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరడం లేదన్నారు. ఇతర బీసీ కులాల వారితో కలిసి ముదిరాజ్‌లు రాజకీయంగా పోరాడాల్సిన అవస రం ఉందన్నారు. రాష్ట్రంలో 46 వేల చెరువులు, కుంటలు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుతో మత్య్సకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 6 జారీచేసింది. అయితే రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాతో పాటు కొన్ని జిల్లాలలో అధికారులు జీవో నెంబర్ 6 ను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముదిరాజ్‌లకు గంగపుత్రులతో పాటు మత్య్సకార సహకార సంఘాలలో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేపల పెంపకం కుటీర పరిశ్రమగా మారిస్తే ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. కేజ్ కల్చర్ కోసం తాము ప్రభుత్వానికి విన్నవిస్తే ఉన్నతాధికారులు మాత్రం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందజేశామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 లో ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ గ్రూప్‌కు మార్చాలని జీవో నెంబరు 15 జారీ చేశారని తెలిపారు. ఆయన హఠాన్మరణం తర్వాత ఆ జీవోను అమలు చేయకపోవ డం దారుణమన్నారు. ముదిరాజ్‌లకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా అన్ని పార్టీల వారు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇతర బీసీ కులాల వారితో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నిస్తామని శంకర్ ముదిరాజ్ హెచ్చరించారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి శివన్న మాట్లాడుతూ బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిటీలను కలిసి ముదిరాజ్ సమస్యలు, డిమాండ్లపై వినతిపత్రాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు బొజ్జ నారాయణ, జిల్లా అధ్యక్షుడు యాసాడ నర్సింగ్, ముదిరాజ్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు సతీష్ , జిల్లా నాయకులు సంగమేశ్వర్, ఎల్లన్న, నారాయ ణ, ప్రసాద్, శ్రీనివాస్, సత్యనారాయణ, మురళి, బోజన్న, జనార్దన్, రాజేశ్వర్, కార్తీక్ పాల్గొన్నారు.
ముదిరాజ్‌లకు మత్స్యసహకార
సంఘాల్లో సభ్యత్వం కల్పించాలి
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్
Comments
Please login to add a commentAdd a comment