గ్రామీణ వైద్యులది ప్రత్యేక స్థానం
● ఐక్యతతోనే పీఎంపీ, ఆర్‌ఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు సాధ్యం
● ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఆరోగ్య తెలంగాణలో గ్రామీణ వైద్యులది ప్రత్యేక స్థానమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలందిస్తున్న పీఎంపీ,ఆర్‌ఎంపీ డాక్టర్ల ఐక్యత, ప్రజల నుంచి లభించే మద్దతు ద్వారా ప్రభుత్వం నుంచి గుర్తింపు సాధ్యపడుతుందన్నారు. శనివారం డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని అమృతాగార్డెన్స్‌లో ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ మహాసభ జరిగింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు వేయిమందికి పైగా పీఎంపీ, ఆర్‌ఎంపీ వైద్యులు హాజరయ్యారు. కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వైద్యుడు లేని చోట వైద్యం అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి అని అన్నారు. గ్రామీణ వైద్యులు హద్దులు దాటి వైద్యం చేయరాదన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మరెడ్డి, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్, అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, తెలంగాణ పీఎంపీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్గం మోహన్, ఉపాధ్యక్షులు రవివర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి పోశాద్రి, లక్ష్మీరాజం, వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment