నిజామాబాద్‌అర్బన్: ఎస్సీ వర్గీకరణ కోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ జనవరి2 న ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (కలెక్టరేట్) రానుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఎస్సీ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, షెడ్యూల్డు కుల సంఘాల నాయకులు, ఇతర ఉద్యోగులు, ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు ఏకసభ్య కమిషన్‌కు వినతులు అందజేయాలని కోరారు. కమిషన్ కు నిర్ణీత నమూనాలో సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాలు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ సహాయ షెడ్యూల్డ్ కులాల అభివద్ధి అధికారి కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment