ఫిర్యాదులను పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాసరావు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
కల్లు విక్రయించే వారిపై చర్యలు తీసుకోండి
మోస్రాలో కొందరు అనధికారికంగా కల్లు విక్రయిస్తున్నారని, లైసెన్సు లేకున్నా ఇంటింటికి వెళ్లి కల్లు అమ్ముతున్నారని గ్రామానికి చెందిన గౌడ కులస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎకై ్సజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
శ్రీ చైతన్య పాఠశాలపై ఫిర్యాదు
నగరంలోని శ్రీ చైతన్య పాఠశాలపై తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రెండో శనివారం, ఆదివారం సహా ఇతర అన్ని సెలవుల్లో పాఠశాల బోధన కొనసాగిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదివరకే డీఈవో, మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
భూమి కబ్జా చేశారు
మాక్లూర్ మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన పెద్ద మల్లయ్య తన భూమిని కబ్జా చేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తన స్థలంలో ఇల్లు, ప్రహరీ నిర్మిస్తున్నారని గ్రామానికి సంబంధించిన రోడ్డు కూడా ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
అర్హులకు ఇళ్లు కేటాయించాలి
ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం అఖిలపక్ష గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇళ్లను అర్హులకు కేటాయించాలని కోరారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
ప్రజావాణికి 105 వినతులు
Comments
Please login to add a commentAdd a comment