రెచ్చిపోయిన దొంగలు
బాల్కొండలో..
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి తాళం వేసిన ఇంట్లోకి చొరబడి దొంగలు రెండు తులాల బంగారం, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన పొగరి చిన్న మల్లేశ్ బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లాడు. భార్య సవిత పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటుంది. ఆమె రెండు రోజుల క్రితం ముప్కాల్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం చోరీ చేశారు. బాల్కొండ ఎస్సై నరేశ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నందిపేట్: నందిపేట్‌లోని రామ్‌నగర్ కాలనీలో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఐదు ఇళ్లలోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాలు.. కాలనీలోని జూడా చర్చ్ సమీపంలో గల ఇసుక కొండయ్య, మేక వెంకటేశ్, పేదూరి భూమేశ్వర్, వీఆర్‌వో రాజేశ్వర్, బైండ్ల నారాయణ కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దొంగలు వారి ఇళ్లలోకి చొరబడ్డారు. ఇసుక కొండయ్య ఇంట్లో 3 తులాల బంగారం, రూ.6 వేల నగదు పోయింది. మిగతా నాలుగు ఇళ్లలో ఏమీ దొరకకపోవడంతో వస్తువులను చిందరవందరగా పడవేసి వెళ్లిపోయారు. దొంగల కదలికలు సీసీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. ఒకే సమయంలో రెండు బ్యాచ్‌లుగా దొంగతనం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీం సభ్యులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం అర్ధరాత్రి కాలనీలో గర్తు తెలియని వ్యక్తులు తలుపులు బాదారని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పామన్నారు.
నందిపేట్‌లో ఐదు ఇళ్లలో చోరీ
బాల్కొండలో రెండు తులాల
బంగారం అపహరణ
Comments
Please login to add a commentAdd a comment