ఆఫీసర్స్ క్లబ్ సర్వసభ్య సమావేశం
● కార్యదర్శిగా గెలుపొందిన స్వామిదాస్
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. క్లబ్ కార్యదర్శి చిలివేరి సత్యనారాయణ వార్షిక ఆర్థిక నివేదికను చదివి వినిపించారు. క్లబ్ సభ్యులు వార్షిక నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుత క్లబ్ ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా క్లబ్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన సర్వసభ్య సమావేశం రెండు గంటల పాటు కొనసాగింది. అనంతరం కార్యదర్శి పదవికి అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగి, ఫలితాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి పి కిరణ్ కుమార్ గౌడ్, అసిస్టెంట్ ఎన్నికల్లో అధికారులు ఎర్రం విగ్నేష్, ఉదయ కృష్ణ, బంటు వసంత్, దొన్‌పాల్ సురేష్ ఫలితాలను ప్రకటించారు. కార్యదర్శి పదవికి పోటీ పడిన స్వామిదాస్ 107 సాధించి గెలుపొందారు.
క్లబ్ ఆఫీస్ బేరర్స్
ఆఫీసర్స్ క్లబ్ బైలా ప్రకారం కలెక్టర్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కొనసాగుతారు. మరొక ఉపాధ్యక్ష పదవి ఉండగా 2025 సంవత్సరానికి తాహెర్ బీన్ హందాన్, సంయుక్త కార్యదర్శిగా డాకం సాయిలు, కోశాధికారిగా కె శరత్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై న విషయం విదితమే. కార్యదర్శిగా స్వామిదాస్ గెలుపొందడంతో క్లబ్ పూర్తి స్థాయి కార్యవర్గం కొలువు దీరనుంది.
లా విభాగంలో ఇద్దరికి డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూ నివర్సిటీ న్యాయ విభాగం పరిశోధక విద్యార్థులు సభావత్ శ్రీనివాస్, రతన్ సింగ్ డాక్టరేట్ సాధించారు. డాక్టర్ ప్రసన్నరాణి పర్యవేక్షణలో ‘భారతదేశంలోని మహిళలకు నివా స స్థల హక్కులు’ అనే అంశంపై శ్రీనివాస్ పరిశోధన పూర్తి చేశాడు. ‘అత్యవసరాల పరిస్థితిలో సినిమా నిర్మాణం– సినిమాల హక్కులు’ అనే అంశంపై రతన్‌సింగ్ పరిశోధన చేశాడు.
ఏపీకే ఫైల్‌తో రూ.1.25 లక్షలు మాయం
కామారెడ్డి రూరల్: ఏపీకే ఫైల్ పంపి అకౌంట్‌లో నుంచి డబ్బులు మాయం చేసిన ఘటన కామారెడ్డిలోని దేవునిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెట్కూరి రవికి రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు. మాటల్లో పెట్టి ఏపీకే ఫైల్ పంపాడు. దాన్ని క్లిక్ చేయడంతో ఫోన్ మొత్తం సదరు వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది. అనంతరం రవి అకౌంట్‌లోని రూ.50 వేలు ఖాళీ చేశాడు. అంతటితో ఆగకుండా రవి పేరిట రూ.75 వేలు లోన్ తీసుకున్నాడు.
పాతకక్షల నేపథ్యంలో కత్తితో దాడి
ఖలీల్‌వాడి: నగరంలోని గౌతమ్ నగర్‌కి చెందిన చంద్రకాంత్ పాత కక్షలతో తునికి యాదగిరిపై కత్తితో దాడి చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. చంద్రకాంత్ ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో యాదగిరి ఆటో టాప్ చింపేసి అతనిపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment