ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతిష్ట పెంచుతా | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతిష్ట పెంచుతా

Published Wed, Jan 1 2025 1:47 AM | Last Updated on Wed, Jan 1 2025 1:47 AM

ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతిష్ట పెంచుతా

ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతిష్ట పెంచుతా

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్‌

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): ఏపీ ఎన్జీఓ అసో సియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలపర్తి విద్యాసాగర్‌ కో–ఆప్షన్‌ ద్వారా ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. దీనికి కో–ఆప్షన్‌ విధానంలో ఎన్నిక నిర్వహించారు. విద్యాసాగర్‌ ఎన్నికను అన్ని జిల్లాల కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ రాష్ట్ర కార్యవర్గానికి పంపించాయి. దీంతో ఎన్నిక ప్రక్రియ పూర్త యింది. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న ఎ.విద్యాసాగర్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఉద్యోగులు ఏపీ ఎన్జీఓ హోం నుంచి జింఖానా మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ మైదానంలో విద్యాసాగర్‌ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. నూతన ప్రధాన కార్యదర్శితో సంఘం అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతిష్టను పెంచుతానని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గాన్ని వీడబోనని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం విద్యాసాగర్‌ను గజమాలతో సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement