దుర్గగుడి ఇన్‌చార్జీ ఈఓగా రామచంద్రమోహన్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మ ల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఇన్‌చార్జీ ఈఓగా అడిషినల్ కమిషనర్–2 కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈఓ కె.ఎస్.రామరావు మంగళవారం ఉద్యోగవిరమణ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జీ ఈఓగా రామచంద్రమోహన్ నియమితులయ్యారు. పూర్తి స్థాయి ఈఓను సంక్రాంతి ఉత్సవాల తర్వాత నియమించే అవకాశం ఉంది.
బాధ్యతలు స్వీకరణ
దుర్గగుడి ఇన్‌చార్జీ ఈఓగా రామచంద్రమోహన్ మంగళవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈఓ రామరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.
భవానీదీక్షల హుండీ ఆదాయం రూ.4.81 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ ఉత్సవాల నేపథ్యంలో దుర్గమ్మ అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల లెక్కింపు పూర్తయింది. రెండో రోజు జరిగిన కానుకల లెక్కింపులో రూ.2.10 కోట్ల మేర ఆదాయం సమకూరింది. రెండో రోజుల్లో 4.81 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. తొలి రోజు జరిగిన లెక్కింపులో రూ.2,70,66,162 నగదు, 210 గ్రాముల బంగారం, 11.240 కిలోల వెండి లభించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన లెక్కింపులో రూ.2,10,58,165 నగదు, 120 గ్రాముల బంగారం, 10.535 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొ న్నారు. రెండు రోజుల్లో రూ.4,81,24,327 నగదు, 330 గ్రాముల బంగారం, 21.775 కిలోల వెండి లభ్యమైంది. కానుకల లెక్కింపును ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు, డీఈఓ రత్నరాజు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment