పోరాటం చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను చాలా ఇబ్బంది పెడుతోంది. శాప్ క్రీడల పాలిట శాపంగా మారింది. జట్లకు సాయం చేయాలని శాప్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు లేఖలు రాసినా ఎలాంటి సమాధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే.. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా తెలిసేలా ఉత్తరాఖండ్‌లో సీఎం చంద్రబాబు ఫొటో ముద్రించి ‘ఆంధ్రాలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎలాంటి సాయం చేయడం లేదు’ అని బ్యానర్ కడతాం. క్రీడాకారుల జెర్సీలపైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని తొలగిస్తాం. చాలా ఆవేదనగా ఉంది. ఇంకో వారం రోజుల్లో బయలుదేరాలి. ఈ నెల 24వ తేదీకి చాలామంది రైల్వే రిజర్వేషన్లు చేయించుకున్నారు.
– ఆర్.కె.పురుషోత్తం,
అధ్యక్షుడు, ఏపీఓఏ
●
Comments
Please login to add a commentAdd a comment