అమిత్‌షా పర్యటనకు పటిష్ట బందోబస్తు
విజయవాడస్పోర్ట్స్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో అమిత్ షా విజయవాడ, తాడేపల్లి, గన్నవరం ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం పోలీస్ కమిషనర్ నోవాటెల్ హోటల్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి అమిత్ షా 18వ తేదీన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా తాడేపల్లికి వెళతారని, అనంతరం నోవాటెల్‌కు చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారని వెల్లడించారు. 19వ తేదీ ఉదయం నోవాటెల్ నుంచి బయలు దేరి కృష్ణాజిల్లాకు గన్నవరానికి చేరుకుని అక్కడ ఎన్‌డీఆర్‌ఎఫ్ నిదం క్యాంపస్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీసీపీలు గౌతమి సాలి, ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, సబ్ కలెక్టర్ చైతన్య, ఏడీసీపీలు రాజారావు, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన పురందేశ్వరి
కొండపావులూరు(గన్నవరం): మండలంలోని కొండపావులూరు శివారులో ఎన్‌ఐడీఎం, ఎన్‌డీఆర్‌ఎఫ్ నూతన భవనాల ప్రారం భోత్సవానికి ఈ నెల 19న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరుకానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పరిశీలించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం భవనాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను, సభ ప్రాంగణాన్ని ఆమె పర్యవేక్షించారు. అమిత్‌షా పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో పురందేశ్వరి చర్చించారు. అమిత్ షా ఇక్కడికి చేరుకుని, తిరిగే వెళ్లే వరకు జరగనున్న కార్యక్రమాలపై ఆమె సమీక్షించారు. బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment