యువతలో నైపుణ్యాభివృద్ధికి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో దేశంలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఇందుకు సంబధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం ఆయన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యపరమైన విద్యతో కూడిన శిక్షణను 12 నెలల పాటు పారిశ్రామిక అనుభవం అందించాలని నిర్ణయించిందన్నారు. 20 కంటే ఎక్కువ రంగాల్లో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ తదితర డిగ్రీ అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ద్వారా జీవనజ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి సంవత్సరం పాటు రూ.5 వేలు చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారన్నారు. జనవరి 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 99895 19495, 89190 23266 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment