ప్రజల భాగస్వామ్యంతోనే ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రమాదాల నివారణ

Published Sat, Jan 18 2025 1:32 AM | Last Updated on Sat, Jan 18 2025 1:32 AM

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రమాదాల నివారణ

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రమాదాల నివారణ

డీటీసీ ఎ.మోహన్‌

విజయవాడస్పోర్ట్స్‌: ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎన్టీఆర్‌ జిల్లా డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ) ఎ.మోహన్‌ అన్నారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రహదారి భద్రతా మాసోత్సవాలు దోహదపడతాయని అన్నారు. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు పోలీస్‌, వైద్య ఆరోగ్య, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, సీట్‌ బెల్డ్‌, హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేశామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. లారీ, బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహించి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో గత ఏడాది 1,343 రోడు ప్రమాదాలు జరగ్గా, 431 మరణాలు సంభవించాయని, 1,159 మంది క్షతగాత్రులయారన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, డ్రైవింగ్‌ సమయంలో ఫోన్‌ మాట్లాడటం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు, వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో సదస్సులు, లఘు చిత్రాలను ప్రదర్శించి విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. అనంతరం రహదారి భద్రత గుడ్‌ సమరిటన్‌పై రూపొందించిన పోస్టర్‌ను రవాణాశాఖ అధికారులు ఆర్‌.ప్రవీణ్‌, కె.వెంకటేశ్వరరావు, కె.శివరాంగౌడ్‌, సత్యన్నారాయణ, అబ్దుల్‌ సత్తార్‌, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, వీడు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాసుతో కలిసి ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement