తిరువూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి
తిరువూరు: గిరిజన మహిళపై దాడి చేసి ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకుడైన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు డిమాండ్ చేశారు. ఇటీవల ఏకొండూరు మండలం గోపాలపురంలో స్థల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఒక గిరిజన మహిళపై దాడికి పాల్పడగా, ఆ మహిళ కుటుంబాన్ని స్వామి దాసు సోమవారం పరామర్శించారు. గిరిజనుల సొంత స్థల వివాదంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం సరికాదని, గతంలో కూడా ఎమ్మెల్యే తీరుతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారని స్వామిదాసు గుర్తు చేశారు. గత 30 ఏళ్లలో తిరువూరు నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు జరగలేదని, కొలికపూడి గెలిచిన నాటి నుంచీ తిరువూరులో సామాజిక సమస్యలు పెచ్చుమీరుతున్నా యని విమర్శించారు. తెలుగుదేశం అధిష్టానం సైతం ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోవడం గమనార్హమన్నారు. ఇకనైనా కొలికపూడి తన పనితీరు మార్చుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు నరెడ్ల వీరారెడ్డి, చలమాల సత్యనారాయణ, తిరు మలశెట్టి వేణు, గత్తం నాగేశ్వరరావు, సురేష్, భూక్యా గన్యా, రేగళ్ల మోహనరెడ్డి, అంజన్‌రెడ్డి, కాలసాని గోపాలనాగేశ్వరరావు, మోదుగు ప్రసాద్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి స్వామిదాసు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment