పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ వేలం పాటల ద్వారా ఆలయానికి రూ.2,31,40,444 ఆదాయం సమకూరినట్లు ఈఓ బి.హెచ్.వి.ఎస్.ఎన్.కిషోర్‌కుమార్ తెలిపారు. ఏడాది పాటు ఆలయం వద్ద ఫొటోలు విక్రయించుకునే లైసెన్స్ హక్కును రూ.5,12,000కు నూతలపాటి రాంబాబు, క్యాంటీన్ నిర్వహణను రూ.11,18,000కు కె.అజయ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. అలాగే చిన్న తీర్థం విక్రయం, చిన్న తీర్థం శుభ్ర పరుచుట, భద్రపరుచు లైసెన్స్‌ను రూ.4,44,444కు ఎ. గోపి, దేవస్థాన ప్రాంగణంలో మిఠాయి, బొంగు బియ్యం విక్రయించుకునే హక్కును రూ.10,16,000కు ఎస్. శ్రీకాంత్ దక్కించుకున్నారు. భక్తులు సమర్పించే వస్త్రాలు పోగు చేసుకునే హక్కును రూ. 66,00,000కు పి. సీతారామారావు, భక్తులు సమర్పించే కొబ్బరి చెక్కలు పోగు చేసుకునే హక్కును రూ.24,52,000కు బి. సుబ్బారావు, వాహనాల పార్కింగ్ రుసుం వసూలు చేసుకునే హక్కును రూ.46,53,000కు ఎల్.వినయ్ దేవస్థాన ప్రాంగణంలో పూలు, పూల దండలు విక్రయించు లైసెన్స్ హక్కును రూ.3,11,000కు టి. సోమయ్య, దేవస్థానం సత్రాల నిర్వహణ, టెంట్ హౌస్ నిర్వహణను రూ.49,15,000కు జి. సుధాకర్, శ్రీగోకులం వద్ద పచ్చగడ్డి విక్రయించునే లైసెన్స్‌ను ఎల్.కోటిరెడ్డి హెచ్చు పాటదారుగా నిలిచి దక్కించుకున్నారు. ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment