బహుళ ప్రయోజనాలను కాదని..
హైదరాబాద్–కోల్‌కతా, చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారులు విజయవాడ నరగంలో వెళ్తుండటంతో దశాబ్దాలుగా ట్రాిఫిక్ సమస్యలు జటిలం అవుతూ వస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యకు తక్షణ పరిష్కారం గురించి యోచించకుండా గ్రాఫిక్స్‌తో కనికట్టు చేసింది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెళ్లే వాహనాల కోసం పశ్చిమ బైపాస్ పనులను చేపట్టింది. కృష్ణా జిల్లాలోని చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ పనులు శరవేగంగా నిర్వహించి, దాదాపు పూర్తి చేసింది. అలాగే గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా వైపునకు వెళ్లేందుకు కూడా రహదారి పనులు చేపట్టింది. ఇదే క్రమంలో చిన్న అవుటపల్లి నుంచే తూర్పు బైపాస్ కూడా నిర్మించాలని తలంచింది. భవిష్యత్తులో బందరు పోర్టు నిర్మాణం పూర్తి అయితే రాకపోకలు సాగించే భారీ వాహనాలతో విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రం అవుతాయని గుర్తించింది. దీంతో తూర్పు బైపాస్‌కు డీపీఆర్ సిద్ధం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమరావతి రింగ్‌రోడ్డు కోసం ఈ రహదారికి మంగళం పలకడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు చైన్నై వైపు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాలన్నా, చిన్న అవుటుపల్లికి వచ్చి రావాల్సిన దుస్థితి వస్తుంది. చైన్నె–కోల్‌కతా రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తప్పే అవకాశమే లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి తూర్పు బైపాస్ రహదారికి ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment