అర్జీల సత్వర పరిష్కారానికి తొలి ప్రాధాన్యం
● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ● పీజీఆర్‌ఎస్‌లో 144 అర్జీల స్వీకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యమివ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా దృష్టి పెట్టాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ డీఆర్వో లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె. శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి. జ్యోతి తదితరులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. పునరావృతంగా కాకుండా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 144 అర్జీలు అందాయన్నారు. వీటిలో రెవెన్యూశాఖకు సంబంధించి 43, మున్సిపల్ శాఖకు 60, పోలీసులకు 8, పంచాయతీరాజ్ 7, సర్వే 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 3, ఉపాధి కల్పన 2, అటవీ శాఖ 2, హెల్త్ 2, హౌసింగ్ 2, ఇరిగేషన్ 2, ఏపీసీపీడీసీఎల్ 1, ఏపీఎస్‌ఆర్టీసీ 1, సీఈవో జిల్లా పరిషత్ 1, కో–ఆపరేటివ్ 1, పౌర సరఫరాలు 1, డ్వామా 1, విద్య 1, గనులు అండ్ భూగర్భ శాఖ 1, సోషల్ వెల్ఫేర్ ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. వీటితో పాటు ఆన్‌లైన్‌లో నమోదవుతున్న అర్జీలను ప్రతి రోజు పరిశీలించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment