పంట పొలంలో ఏనుగు మృతదేహం | - | Sakshi
Sakshi News home page

పంట పొలంలో ఏనుగు మృతదేహం

Published Mon, Oct 14 2024 1:34 AM | Last Updated on Mon, Oct 14 2024 1:34 AM

పంట ప

భువనేశ్వర్‌: పంట పొలంలో ఏనుగు మృతదేహం గుర్తించారు. అంగుల్‌ జిల్లా అఠొమల్లిక్‌ అటవీ మండలం పరిధి మాధాపూర్‌ రేంజ్‌ శంఖమాల్‌ గ్రామం శివారులో పంట పొలంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మృత్యు సంఘటన పూర్వాపరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రసాదం తిని పలువురికి అస్వస్థత

భువనేశ్వర్‌: దసరా ఉత్సవాల్లో దేవీ పూజల ప్రసాదం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. పూరీ జిల్లా గోప్‌ మండలం ఒటాంగ్‌ గ్రామంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. ఈ గ్రామంలో దుర్గాదేవి పూజల్లో ప్రసాదం తిన్నవారంతా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పులువురిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స కొనసాగిస్తున్నారు. మరి కొందరి పరిస్థితి విషమించడంతో భువనేశ్వర్‌ ఆస్పత్రికి తరలించారు. భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక వైద్య బృందం ప్రభావిత ఒటాంగ్‌ గ్రామం సందర్శించింది. పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షిస్తోంది.

నైరుతి రుతు పవనాల నిష్క్రమణ

భువనేశ్వర్‌: రాష్ట్రం నుంచి నైరుతి రుతు పవనాలు తరలిపోయే సమయం దగ్గర పడింది. దీనికి వాతావరణం అనుకూలిస్తోందని స్థానిక ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. రానున్న ఒకటి, రెండు రోజుల్లో నైరుతి రుతు పవనాలు వెనుదిరిగే అవకాశం ఉందని ఈ కేంద్రం పేర్కొంది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఝార్కండ్‌, బీహారు నుంచి రుతు పవనాలు తరలిపోతాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాలు, సిక్కిం ప్రాంతాల నుంచి నైరుతు రుతు పవనాలు పాక్షికంగా తరలిపోనున్నాయి. ఈ ఏడాది సాధారణ సమయం కంటే 4 రోజులు ముందుగా రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. కేరళకు తాకిన 8 రోజుల్లో రాష్ట్రానికి నైరుతి రుతు పవనాల ఆగమనం ఆరంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున సాధారణ వర్షపాతం నమోదు అయింది. మరో వారం రోజులపాటు వర్ష సూచన లేనందున రుతు పవనాలు వెనుదిరిగేందుకు అనుకూలత ఏర్పడుతుంది.

దొంగ బాబా అరెస్టు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో దొంగ బాబా ముసుగు తొలగింది. కటక్‌ జిల్లా టిగిరియా ప్రాంతంలో సోమ్‌పడా ఆశ్రమం బాబాగా చలామణి అవుతున్న కై బల్య జానీ అరెస్టు అయ్యాడు. యువతి అపహరణతో ఆశ్రమంలో వ్యవహారం గుట్టురట్టు అయింది. ఢెంకనాల్‌ జిల్లా భాపూర్‌ ప్రాంతంలో అపహరణకు గురైన యువతి తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చేపట్టిన దాడిలో దొంగ బాబా పట్టుబడ్డాడు. ఢెంకనాల్‌ సబ్‌ డివిజినల్‌ పోలీసు అధికారి ఎస్‌డీపీఓ ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా ఆశ్రమంపై దాడి చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడిలో ఆశ్రమంలో లైంగిక వ్యవహారాలతో పలు అభ్యంతరకర సంఘటనలు దృష్టికి వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పంట పొలంలో ఏనుగు  మృతదేహం1
1/2

పంట పొలంలో ఏనుగు మృతదేహం

పంట పొలంలో ఏనుగు  మృతదేహం2
2/2

పంట పొలంలో ఏనుగు మృతదేహం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement