ఘనంగా భౌగోళిక సమాచార వ్యవస్థ దినోత్సవం
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం భౌగోళిక సమాచార వ్యవస్థ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు హాజరయ్యారు. అలాగే జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్ ఎం.ఎల్ నర్సింహం, కన్వీనరు, డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా, డైరెక్టర్ (అడ్మిన్) డా.దుర్గాప్రసాద్ పాఢి, రిజిస్ట్రారు డాక్టర్ అనితా పాత్రో సివిల్ ఇంజనీరింగ్ ముఖ్యశాఖ విక్రం నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం.ఎల్. నర్సింహం మాట్లాడుతూ, భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ప్రకృతి విపత్తులు ముందుగానే పసిగట్టి అప్రమత్తం కావచ్చని అన్నారు. జియోస్పెషల్ టెక్నాలజీ ద్వారా రిమోట్ సెన్సింగ్, జీపీఎస్ టెక్నాలజీ మనకు కచ్చితమైన సమాచారం శాటిలైట్ ద్వారా అందిస్తుందని మాజీ డైరెక్టర్ ఐఎండీ డాక్టర్ శరత్ చంద్ర సాహు అన్నారు. అనంతరం భౌగోళిక సమాచార వ్యవస్థపై ముద్రించిన సావనీర్‌ను గౌరవ అతిథులు ఆవిష్కరించారు. ఆన్‌లైన్ ద్వారా డాక్టర్ జె.మురళీధరన్, స్మార్ట్ సిటీ, భవిష్యత్ అభివృద్ధిపై మాట్లాడారు. కార్యక్రమం అనంతరం శరత్ చంద్రసాహు, ఎంఎల్ నర్సింహంలను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment