ఔషధాలపై జీరో జీఎస్టీ అమలు చేయాలి
జయపురం: దేశంలో అన్ని రకాల మందులపై జీరో జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని ఒడిశా సేల్స్ రిప్రెజింటివ్స్ యూనియన్ కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. సోమవారం స్థానిక కార్మిక భవన ప్రాంగణంలో నిర్వహించిన 28వ జిల్లా కాన్ఫరెన్స్‌లో యూనియన్ అధ్యక్షుడు కృష్ణచంద్ర సామంతరాయ్ కార్మిక పతాకం (ఎర్ర జెండా) ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన అధ్యక్షతన జరిగిన కాన్ఫ్‌రెన్స్‌కు ముఖ్యఅతిథిగా సంబల్‌పూర్ యూనియన్ నేత డాక్టర్ కేదార్ నాత్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ మందుల ధరలు సామాన్యుడికి అందలేనంతగా పెరిగి పోయాయని, మందులపై జీఎస్టీ తొలగించి జీరో జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని కోరారు. ఔషధ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. దేఽశంలో మూతపడిన ప్రభుత్వరంగ ఔషధ కర్మాగారాలను తెరవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కలను అణిచివేసే నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సేల్స్ రిప్రజెంటీవ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పోరాటాలు చేసి డిమాండ్లు సాధించుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో సంఘ కార్యదర్శి రంజిన కుమార్ మిశ్ర, కార్మిక సమన్వయ కమిటీ ఉపాధ్యక్షుడు నళినీ రథ్, ఒడిశా సేల్స్ రిప్రెజింటీవ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ కుమార్ మిశ్ర, సహాయ కార్యదర్శి నృసింహ ప్రసాద్ బ్రహ్మ తదితరులు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను దుయ్యబట్టారు. జిల్లా ఒడిశా సేల్స్ రిప్రెజింటీవ్స్ యూనియన్ కొరాపుట్ నూతన కార్యవర్గ ఎన్నకలు నిర్వహించారు. సరోజ్ కుమార్ పట్నాయక్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా యోగెన్ చౌదరి, జిల్లా కార్యదర్శిగా రంజన్ మిశ్ర, కార్మదర్శిగా సంతోష్ దొలాయ్, కమిటీ సభ్యులుగా మోహన్ పాత్రో, దేబాశిష్ మిశ్ర, ఆశిష్ సాహు, శివ శంకర పాత్రో, ప్రిన్ష్ కిలాడి, కృష్ణ చంద్ర సామంతరాయ్, బికాశ గౌడ, రవీంద్ర ప్రదాన్, అహమ్మద్ రాజ, సుమన్ సాహు, పవన్ కుమార్, నికుంజ సాహును ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment