మానవ మనుగడకు మహిళలే ఆలంబన
విజయనగరం: సీ్త్ర లేకపోతే జననం లేదు. గమనం లేదు. సీ్త్ర లేకపోతే సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గురజాడ స్మారక కేంద్ర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడుతూ తల్లిగా లాలిస్తూ..తోబుట్టువుగా..భార్యగా బాగోగులు చూస్తూ.. సేవకురాలిలా కుటుంబ భారాన్ని మోసేది మహిళే అని అన్నారు. మానవ ఉనికికి మూలం, మనుగడకు ఆలవాలం మహిళేనని మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ అని వివరించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా రంగంలో కృషిచేసిన 15 మంది మహిళలకు సంఘం అధ్యక్ష కార్యదర్శులు గురుప్రసాద్, సుభద్రాదేవిలతో కలసి పతకాలను ప్రదానం చేసి అభినందించారు. సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ గోటేటి హిమబిందు, నిర్మల, రమణమ్మ, దాసరి పద్మ, సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment