నిధులు కేటాయించండి
జయపురం: జయపురంలో చారిత్రిక జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులలో మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, మునిసిపాలిటీ అధికారులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ నరేంఽద్రకుమార్ మహంతి, వైస్ చైర్‌పర్సన్ బి.సునీత నేతృత్వంలో బీజేడీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి నిధుల కోసం రాజధాని భువనేశ్వర్‌కు మంగళవారం వెళ్లారు. జగన్నాథసాగర్ పనులు నిలిచిపోవటం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి విభాగ మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్రోను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతితో కలిసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్‌పర్సన్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి విభాగ ప్రధాన కార్యదర్శి ఉషా పాడిని కలిసి జగన్నాథ్ సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేడీ కౌన్సిలర్లు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్‌ను కలిసి జయపురం జగన్నాథ్ సాగర్ పురుద్ధరణ కోసం నిధులు వెంటనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా నరేంద్రకుమార్ మహంతి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం మారిన తరువాత జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణకు నిదులు విడుదల చేస్తారని ఆశించామని, నేటివరకు నిధులు రాలేదని వెల్లడించారు. పునురుద్ధరణ పనులు నిలిచిపోయాయని, అందువల్ల తామంతా భువనేశ్వర్ వచ్చామన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment