బాధిత కుటుంబానికి సాయం
రాయగడ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా తొమ్మిది రోజుల పసికందును 20 వేల రుపాయలకు విక్రయించడం విచారకరమని, ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. బుధవారం నువాపడ బస్తీలో పర్యటించి బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులను పరామార్శించారు. వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలోనూ పర్యటించాలన్నారు. పసికందు విక్రయంపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. జేకేపేపర్ మిల్లు వంటి పరిశ్రమ ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య వెంటాడటంతో రోజురోజుకూ వలసలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల కిందట కంధమాల్ జిల్లాలో మామిడి టెంకల జావ తాగి మృత్యువాత పడిన ఘటనను గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment