హుండీ ఆదాయం లెక్కింపు
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో జగన్నాథ మందిరంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. కానుకల రూపంలో రూ.40051 ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రంజన్ కుమార్ మానసెఠి, మందిర నిర్వాహక కమిటీ అధ్యక్షులు నరసింహ పాఢి, సభ్యులు గుడ్ల ప్రసాదరావు, గోపాల్ శెఠి పెంటియా, పాలకొండ పటి, శ్రీనివాస్ చౌదరి, మావుడి బారిక్, ఆర్‌ఐ గౌరి కొండగిరి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వైద్య పరీక్షలు
రాయగడ: జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ రాజేష్ పాడి, ఫార్మసీ విభాగం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ పాత్రో, నర్సింగ్ విభాగానికి చెందిన కె.ఊర్మిల, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
నలుగురు దోపిడీ దొంగలు అరెస్టు
జయపురం: దోపిడీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజన్ కుంధ్రా పోలీసు స్టేషన్ అధికారి బుధవారం తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.3000 నగదు, బైక్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో తర్గెయ్ గ్రామానికి చెందిన రంజన్ కెచప్, కలియగాం గ్రామానికి చెందిన ఆలియ హరిజన్, రవీంద్ర టకిరి, తెర్జి గ్రామానికి కయినా నాయిక్ ఉన్నారు. వీరంతా ఈ నెల 9న మల్కనగిరి జిల్లా నెం.వి 39 గ్రామానికి చెందిన భారత్ ఫైనాన్స్ మేనేజర్ సులోచనరంజన్ హల్దార్‌ను అడ్డగించి నగదు, ఇతర వస్తువులు దోచుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచినట్లు వెల్లడించారు.
ప్రమాదానికి గురైన వ్యాన్
● డ్రైవర్‌కు గాయాలు
జయపురం: జిల్లాలోని 26వ జాతీయ రహదారి జయపురం–బొరిగుమ్మ మధ్య ఉమ్మిరి వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్ ప్రమాదానికి గురికావడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన నాగేష్ కుమార్ మహిలింగ(30)గా గుర్తించారు. అతడిని 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిచారు. రాయిపూర్ నుంచి పార్శిల్‌లతో వస్తున్న వ్యాన్ ఉమ్మిరి వంతెన ప్రాతంలో వంతెన కంచెను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్‌లో చిక్కుకున్న డ్రైవర్ నాగేష్‌ను బయటకు తీసి రక్షించారు. జయపురం సదర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment