ఆశ్రమ పాఠశాల సందర్శన
● 141 బియ్యం బస్తాలు మాయమైనట్లు గుర్తింపు..
మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి పద్మాగిరి పంచాయతీలో ఉన్న షెడ్యూల్డ్ తెగకు చేందిన ఆశ్రమ పాఠశాలను మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి సందర్శించారు. విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో పాఠశాల సిబ్బందిపై మండిపడ్డారు. తరగతి గదులను, విద్యార్థుల హాజరును పరిశీలించారు. 7వ తరగతి విద్యర్థులకు స్వయంగా పాఠం బోధించారు. 6, 7వ తరగతి విద్యార్థుల సంఖ్యతో ఎందుకు తేడాలున్నాయని హెచ్‌ఎం లక్ష్మణ్ పాత్సాని ప్రశ్నించారు. అనంతరం వసతి గృహన్ని సందర్శించారు. అక్కడ మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థుల పరిస్థితిని చూసి చలించిపోయారు. ఇలా ఉంటే రోగాలబారిన పడాతారని, అందుచేత వీలైనంత త్వరాగా శుభ్రం చేయించండని ఆదేశించారు. వంటశాలను చూడగా పిల్లల కోసం ఉంచిన 141 బియ్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. వీటిగూర్చి ఉపాధ్యాయుడితో చర్చించారు. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మల్కన్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రదాన్, మల్కన్‌గిరి సమితి వైస్ ప్రెసిడెంట్ నిరంజర్ హల్ద్‌ర్, సత్య సర్యపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment