సంక్షేమ పథకాల అమలులో.. సహకార సంస్థలది కీలక పాత్ర
జయపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయటంలో సహకార సంస్థలు ప్రధాన భూమిక వహించాలని కొరాపుట్ వెమ్మెల్యే రఘునాథ్ మచ్చ పిలుపునిచ్చారు. స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీ బ్యాంక్) సభాగృహంలో జిల్లా సహకార విభాగంవారు 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొరాపుట్ జిల్లాలో కాపీ, మత్య్స, చోడి, వివిధ మసాలాలు, ఇతర పంటలు పండించి వాటిని సహకార సంస్థలతో మార్కెట్ చేయాలన్నారు. అలా జరిగినప్పుడే రైతులు లబ్ధిపొంది ఆర్థిక ఉన్నతి జరుగుతుందన్నారు. దీనికి సహకార సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సహకార ఉద్యమంలో సీనియర్ కార్యకర్త బొరిగుమ్మ వాసి లాలూ మణిసింగ్, జయపురం సహకార బ్యాంక్ ఉత్తమ మేనేజర్ సుధాంశు శేఖర పాడీ, ఉత్తమ బ్రాంచ్ మేనేజర్ మనోజ్ కుమార్ దాస్‌లను ఎమ్మెల్యే సన్మానించారు. సహకార ఉద్యమంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్తమ సహకార సంస్థల ఉద్యోగులకు, జిల్లాలో 11 ఉత్తమ సహకార సంస్థలకు బహమతులు అందించారు. కొరాపుట్ కేంద్ర సహకారం బ్యాంక్ అధ్యక్షుడు, ఇంజినీర్ ఈశ్వర చంద్ర పాణిగ్రహీ అధ్యక్షతన జరిగిన సహకార వారోత్సవాలలో బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళొ, డీఆర్‌సీఎస్ భీమ సేన్ సాహు, వారోత్సవాల పరిచాలన కమిటీ ఉపాధ్యక్షుడు దృపద భొత్ర, బ్యాంక్ కార్యదర్శి హరిశ్చంద్ర బొనగాడి, నబార్డ్ డీడీఎం దేవేంద్ర కుమార్ ప్రధాన్ అతిథిలుగా హాజరయ్యారు. సహకార సంఘ విభాగ ఎస్‌ఆర్‌సీఎస్ శశికాంత దాస్, మరో ఎస్‌ఆర్‌సీఎస్ బిద్యాధర్ బెహర, కొరాపుట్ సహకార శిక్షణ కేంద్ర ప్రిన్సిపాల్ అక్షయ కుమార్ పాత్రో, బ్యాంక్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ
Comments
Please login to add a commentAdd a comment