క్రీడలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ఉల్లాసం

Published Fri, Nov 22 2024 12:49 AM | Last Updated on Fri, Nov 22 2024 12:49 AM

క్రీడలతో మానసిక ఉల్లాసం

క్రీడలతో మానసిక ఉల్లాసం

జయపురం: బొరిగుమ్మలో గల సరస్వతీ శిశుమందిరం వార్షికోత్సవం సందర్భంగా రెండురోజుపాటు నిర్వహంచిన క్రీడా ఉత్సవాలు గురువారం ముగిశాయి. క్రీడా ఉత్సవాల పరిచాలన కమిటీ అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్‌ దండసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. మొత్తం 36 రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 210 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 108 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలచి బహుమతులు పొందారు. ఐదుగురు విద్యార్థులు ఉత్తమ క్రీడాకారులుగా ఎంపికయ్యారు. ప్రతి పోటీలో ప్రథమ స్థానంలో నిలచిన వారందరినీ త్వరలో జరుగనున్న జిల్లాస్థాయి పోటీలకు పంపనునట్లు నిర్వాహకులు వెల్లడించారు. బొరిగుమ్మ పంచాయతీ సర్పంచ్‌ తుషార్‌కాంత కుమ్రిక ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.సరస్వతీ శివుమందిర హెచ్‌ఎం ఆచార్య మమతా మహాపాత్రో పర్యవేక్షణలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement