విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీనియర్స్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ చీఫ్ కోచ్ డీవీ చారి ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి నగరంలోని కస్పా ఉన్నత పాఠశాలలో జరిగే ఎంపిక పోటీల్లో 18 సంవత్సరాలు వయస్సు నిండి ఎఫ్‌ఏఐ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. జిల్లాస్థాయి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు విజయనగరం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఫోన్ 83747 37707 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment