విజయనగరం: జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలతో పాటు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.మాణిక్యంనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017వ సంవత్సరం అనంతరం మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న తెలుగు విభాగంలో 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను, కార్పొరేషన్ పరిధిలో సోషల్ విభాగంలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ 3 పోస్టులను భర్తీ చేసేందుకు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు వారి సేవా పుస్తకం, ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment