జాతీయ సెపక్‌తక్రా పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న సెపక్‌తక్రా పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు అర్హత సాధించారు. ఇటీవల ఉరవకొండలో జరిగిన సబ్‌జూనియర్స్ అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొన్న గంట్యాడ కేజీబీవీలో చదువుతున్న కుమ్మరి అశ్విని, గండిమాని పవిత్రలు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలో జరగబోయే జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన ఇద్దరు క్రీడాకారులను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, సెపక్‌తక్రా జిల్లా కార్యదర్శి రాజేష్, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్ రాజు, వ్యాయామ ఉపాధ్యాయినులు పి.భవాని, డి.సీతలు అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభా పాటవాలు కనబరిచి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment