మాంగనీస్ అక్రమ తవ్వకాలపై దాడులు
రాజాం: మండల పరిధిలో గార్రాజు చీపురుపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లోని జీడి తోటల్లో విజయనగరం రీజనల్ మైనింగ్ అధికారి బి.ప్రసాదరావుతో పాటు సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు. ఈ ప్రాంతంలో మాంగనీస్ ఖనిజం అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుమేరకు రాజాం రెవెన్యూ అధికారులతో కలిసి మైనింగ్ చేస్తున్న ప్రాంతం వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మాంగనీస్ రాళ్లు తవ్వుతున్న పొక్లెయిన్‌తో పాటు రవాణాకు సిద్ధం చేసిన ట్రాక్టర్‌ను పట్టుకుని సీజ్ చేశారు. ఈ మైనింగ్‌ను చింతగుంటి ఢిల్లీశ్వరరావు, తోట జోసెఫ్, బూరాడ సురేష్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, వారిపై రాజాం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రీజనల్ ఆఫీసర్ ప్రసాదరావు మాట్లాడుతూ మాంగనీస్ ఖనిజాన్ని ఎవరైనా అక్రమంగా తవ్వడం, తరలించడం చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. నిరంతరం ఈ కార్యక్రమాలపై నిఘా పెట్టామని, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ డి.సతీష్‌కుమార్, ఏజీ ఎం.సురేష్‌కుమార్, జిల్లా గనులు, భూగర్భశాఖ డీడీ సి.మోహనరావు, ఆర్‌ఐ ఎస్.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
పొక్లెయిన్, ట్రాక్టర్ సీజ్
Comments
Please login to add a commentAdd a comment