అథ్లెటిక్స్ పోటీల్లో విద్యుత్ ఉద్యోగులకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్‌కు చెందిన ఉద్యోగులు సత్తా చాటారు. ఇటీవల గుడివాడలో జరిగిన పోటీల్లో వివిద అంశాల్లో పతకాలు దక్కించుకుని ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. పోటీల్లో పాల్గొన్న పోలిపల్లి పైడిరాజు లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం, 400 మీటర్ల పరుగు పోటీల్లో కాంస్యం, 5000 మీటర్ల వాకింగ్ పోటీల్లో రజత పతకం, 400 మీటర్ల రిలే పరుగు పోటీలో మరో రజత పతకం సాధించారు. అలాగే ఎ.రామకృష్ణ 1500 మీటర్ల పరుగు పోటీల్లో రజత పతకం 5000 మీటర్ల వాకింగ్ పోటీల్లో కాంస్య పతకతం దక్కించుకున్నారు. ఇవే పోటీల్లో పి.అనిల్ కుమార్ 200 మీటర్ల పరుగు పోటీల్లో బంగారు పతకం కై వసం చేసుకగా..400 మీటర్ల పరుగు పోటీల్లో బంగారు పతకం, 100 మీటర్ల పరుగు పోటీలో రజత పతకం సాధించారు. రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన ముగ్గురు ఉద్యోగులను అపరేషన్ సర్కిల్ అధికారులు, ఉద్యోగులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment