భోగాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో జిల్లాలోని భోగాపురం మండలం ముక్కాం, చేపలకంచేరు, కొండ్రాజుపాలెం సముద్రతీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకువచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో రెవెన్యూ, మైరెన్ మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.
21న సాగునీటి ప్రాజెక్టు
కమిటీల చైర్మన్ ఎన్నిక
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని ఐదు సాగునీటి ప్రాజెక్టు కమిటీలకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. డెంకాడ ఆయకట్టు సిస్టం, ఆండ్ర రిజర్వాయర్, తాటిపూడి రిజర్వాయర్, పారాది ఆయకట్టు, గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టు స్టేట్–1 లకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12:30 గంటల వరకు జరిగే ఎన్నికల పక్రియలో ఇటీవల సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొని ప్రాజెక్టు కమిటీకి చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. సూపరింటెండెంట్ ఇంజినీర్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment