భువనేశ్వర్:
రాష్ట్రంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణతో రాస్ట్ర, దేశ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఇమిడి ఉంటాయనే దృక్పథంతో స్వార్థ ప్రయోజానాల కోసం రాజకీయ విలువలకు భంగం కలగకుండా ఆది నుంచి ఆచి తూచి అడుగు వేయడంలో నవీన్ పట్నాయక్ హుందాతనం చాటుకున్న రాజకీయవేత్తగా పేరొందారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ స్పర్థల్ని పక్కన బెట్టి పలు సందర్భాల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదనలకు అండగా నిలిచి విపత్తు నుంచి గట్టెక్కించిన దాఖలాలు కోకోల్లలు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం రైల్వే మంత్రిగా కొనసాగుతున్న అశ్విని వైష్ణవ్ సభ్యత్వం. నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు పార్టీ భే దాభిప్రాయాలకు అతీతంగా దేశ సమగ్ర అభివృద్ధి సత్సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అశ్విని వైష్ణవ్‌కు వరుసగా 2 సార్లు ఓటు వేసి గెలిపించి ఎగువ సభకు ప్రాతినిథ్యం కల్పించారు.
తాజాగా నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశ పెట్టిన ఒక దేశం ఒక ఎన్నిక యోచన పట్ల బీజేడీ తన వైఖరిలో ఏమాత్రం తేడా లేకుండా లోతుగా సమీక్షిస్తోంది. ఒక దేశం ఒక ఎన్నిక బిల్లు పట్ల తమ పార్టీ ఆచి తూచి సకాలంలో సముచిత నిర్ణయంతో ముందుకు వస్తుందని బీజేడీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్రో ప్రకటించారు. మోదీ సర్కారు ప్రతిపాదించిన ఒక దేశం ఒక ఎన్నిక బిల్లు సమగ్ర సారాంశం లోతుగా పరిశీలించిన మేరకు దేశ హితవు సమీక్షించిన మేరకు తుది నిర్ణయం ఖరారవుతుందని, పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు పార్లమెంటులో తమ వైఖరి ఉంటుందని సస్మిత్ పాత్రో స్పష్టం చేశారు. బీజేడీ హుందాతనం ఏమాత్రం డీలాపడే ప్రసక్తే లేదన్నారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ దిశలో అడుగు వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక దేశం ఒక ఎన్నిక బిల్లు సంయక్త పార్లమెంటరీ కమిటి (జేపీసీ) పర్యవేక్షణలో ఉంది. ఈ కమిటీ నివేదికని బీజేడీ విశ్లేషించిన మేరకు నిర్మాణాత్మక శైలిలో తన నిర్ణయం నిర్ధారిస్తుంది.
మూడింట రెండు వంతుల బలం లేకుంటే పార్లమెంటులో ప్రతిపాదిత బిల్లు ఆమోదం పొంది చ ట్టంగా అమలు చేసే అవకాశం లేదనేది సుస్పష్టం. రాజ్య సభలో బిజూ జనతా దళ్ బలం 7 స్థానాలు. ఈ బలంతో నిర్ణయాత్మక శక్తిగా బీజేడీ తన ప్రాధాన్యతని మరోసారి తెరపైకి తెస్తుందని సమాచారం. ప్రతిపాదిత బిల్లు ఇంకా ప్రాథమిక దశలో కొనసాగుతోంది. భావి పరిణామాలపై అనుబంధ వర్గాల బహుముఖ అభిప్రాయాలతో బీజేడీ స్వీయ వైఖరి ని సమన్వయపరచి సమయోచితంగా వ్యవహరిస్తు ందని ప్రకటించింది. ఈ వైఖరితో పార్లమెంటులో అధికార, విపక్షాల దృష్టి బీజేడీపై కేంద్రీకృతమైంది.
శాసన సభలో పరోక్ష సంకేతం
రాష్ట్ర శాసన సభలో ప్రతిపాదిత ఒక దేశం ఒక ఎన్నిక యోచనను బిజూ జనతా దళ్ పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్లు అధికార పక్షం భావిస్తోంది. శాసన సభలో ఇటీవల ముగిసిన శీతా కాలం సమావేశాలను పురస్కరించుకుని ఈ ప్రతిపాదనపై బీజేడీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వంయి ప్రసంగించారు. ప్రతిపాదిత బిల్లు ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరిచే లక్షణాలతో కూడి ఉందని, దీంతో జాతి సమైక్యత భావాలకు భంగం కలిగించే అవకాశం ఉంటుందని సూచనప్రాయంగా పేర్కొన్నారు. దీని ఆధారంగా బిజూ జనతా దళ్ ప్రతిపాదిత బిల్లుని వ్యతిరేకిస్తుందనే దుమారం రాజకీయ శిబిరాల్లో చర్చనీయాంశమైంది. అయితే బీజేడీ దేశ, రాష్ట్ర స్వార్థ ప్రయోజనాల కోసం చౌకబారు రాజకీయ ప్రయోజనాలకు తలొగ్గకుండా నిరంతరం ఆచి తూచి మెసలుకుని జాతీయ రాజకీయాల్లో పరపతిని పరిరక్షించుకుంటూనే ఉంది. ఇటీవల భారత ఉప రాష్ట్రపతి, రాజ్య సభ అధ్యక్షుడు జగదీప్ ధన్‌కర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపట్ల బిజూ జనతా దళ్ మద్దతు నిరాకరించింది. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఆ పార్టీ రాజ్య సభ సభ్యుడు నిరంజన్ బిసి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment