ఉత్సాహంగా గజపతి ఉత్సవ జ్యోతి ఊరేగింపు
పర్లాకిమిడి: స్థానిక శ్రీజగన్నాథ మందిరం నుంచి గజపతి ఉత్సవాల జ్యోతిని పట్టణంలోని పలు కూ డళ్లలో బుధవారం సాయంత్రం ఉత్సాహంగా ఊరేగించారు. గజపతి ఉత్సవాలు ప్రారంభోత్సవాల సందర్భంగా మార్కెట్ కూడలి వద్ద మహారాజా శ్రీకృష్ణచంద్రగజపతి విగ్రహానికి పర్లాకిమిడి ఎమ్మె ల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి నివాళులర్పించారు. అనంతరం మేళతాళాలతో ఉత్సవ జ్యోతిని హైస్కూల్ జంక్షన్ మీదుగా గజపతి స్టేడియం వద్దకు చేరుకొని గజపతి ఉత్సవా ల వేదిక వద్ద ఉంచారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ అధికారి గుణనిధి నాయక్, డిప్యూటీ కలెక్టర్ కమలకాంత పండా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment