కలెక్టర్ సమక్షంలో బిడ్డ దత్తత
పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ చాంబర్‌లో బుధవారం సంతానం లేని కోరాపుట్‌కు చెందిన దంపతులకు ఆరు నెలల ఆడ శిశువును దత్తత నిమిత్తం అందజేశారు. కొద్ది నెలల క్రితం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వదిలేసిన ఈ శిశువును జిల్లా శిశు సురక్షా సమితి, నిస్సాన్ సలోం పిల్లల దత్తత కేంద్రం చేరదీసి సంరక్షించారు. మూడేళ్ల క్రితం కోరాపుట్‌కు చెందిన దంపతులు కేంద్ర పౌష్యసంతాన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోగా నేటికి అధికారులు దరఖాస్తు పరీక్షించి ఆడశిశువును అధికార పూర్వకంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి అశ్వినీ కుమార్ మహాపాత్రో, జిల్లా శిశుసంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, నిస్సాన్ సలోం దత్తత కేంద్రం అధికారి స్వాలసింగి పాల్గొన్నారు. ఇప్పటివరకూ జిల్లా నుంచి 63 మంది పిల్లలను వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి దత్తతగా స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment