మల్కన్‌గిరి: జిల్లా కేంద్రం మల్కన్‌గిరిలో కొద్ది రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి మాల్యవాంత్ ఉత్సవాలు మంగళవారం రాత్రితో వైభవంగా ముగిశాయి. చివరిరోజు కళా ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కామి, చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో, బలిమెల ఎన్‌ఏసీ చైర్మన్ ప్రదీప్ నాయక్, మల్కన్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, డీఐపీఆర్‌వో ప్రమిళ మాఝి తదితరులు పాల్గొన్నారు. కళాకారులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment