కళలకు ఖిల్లా
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
గజపతి జిల్లా..
పర్లాకిమిడి:
స్థానిక గజపతి స్టేడియంలో గజపతి ఉత్సవా లు, పల్లెశ్రీ మేళాను రాష్ట్ర ఖనిజ, వాణిజ్య, రవాణా మంత్రి బిభూతి భూషన్ జెన్నా మంగళవారం సా యంత్రం ప్రారంభించారు. అనంతరం ఉత్సవాల పతాకాన్ని గజపతి స్టేడియంలో ఎగురవేశారు. రాష్ట్ర మంత్రి బిభూతి జెన్నాను కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ఘనంగా స్వాగతించారు. అనంతరం పల్లెశ్రీ మేళాను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గజపతి ఉత్సవాలలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన విభిన్న స్టాల్స్‌ను సందర్శించారు. గజపతి జిల్లా కళలకు పుట్టినిల్లు అని అన్నారు. ఉత్సవాలకు గౌరవ అతిథులుగా మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, ఎస్పీ జితేంద్ర కుమార్ పండా, సినీ నటి పింకి ప్రధాన్, డీఆర్‌డీఏ సీడీఎం గుణనిధి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బిభూతి భూషణ్ జెన్నా మాట్లాడుతూ పర్లాకిమిడి మహారాజా శ్రీకృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ స్వతంత్ర ఒడిషాకు బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాడారని అన్నారు. ఈ సందర్భంగా సినీ నటి పింకి ప్రధాన్ శ్రీరాం గీతాన్ని ఆలపించారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment