● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్‌ఓ కె.హేమలత, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి భాగస్వాములై అర్జీదారులనుంచి 121 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేసి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇవ్వాలని, అర్జీలను ఆడిటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కార ప్రగతిపై ప్రతివారం సమీక్షించనున్నట్లు చెబుతూ అర్జీలు రీ ఓపెన్ కాకుండా సరైన కారణాలను అర్జీదారుకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డా. ఎం.వినోద్ కుమార్, ప్రోగ్రాం అధికారి డా. టి. జగన్‌మోహన్‌రావు, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.ఎస్. మన్మథరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి. శ్రీనివాసరావు, డ్వామా, డీఆర్‌డీఏ పథక సంచాలకులు కె.రామచంద్రరావు, వై.సత్యంనాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భూసార పరీక్షల కిట్లు అందజేత
కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో సోమవారం భూసార పరీక్షల కిట్లను మండల వ్యవసాయాధికారులకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో జిల్లాలో భూసార పరీక్షలను నిర్వహించి, రైతులకు వివరించాలని చెప్పారు. పంట దిగుబడులను పెంచేందుకు, వ్యవసాయ మదుపులను తగ్గించేందుకు భూసార పరీక్షలు ఎంతో దోహదం చేస్తాయన్నారు.
టచ్‌ఫోన్‌ల పంపీణీ
కలెక్టరేట్‌లో సోమవారం ఇద్దరకు బధిరులకు టచ్‌ఫోన్లను కలెక్టరేట్‌లో అందజేశారు. టచ్‌ఫోన్‌ల కోసం అర్జీ అందజేసిన డి.రవీంద్ర, బి.పారయ్యలు వాటిని కలెక్టర్ చేతులమీదుగా అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment