జాతరో జాతర
జయపురం: కొరాపుటియ కళాకారుల బృందం సోమవారం సాయంత్రం 8 దినాల ఫుష్‌పుణి మహోత్సవాలను ప్రారంభించింది. స్థానిక బంకమఠం నుంచి సాంస్కృతిక పౌరాణిక, ఆదివాసీ, జానపద, సంప్రదాయ వేషాలతో వందలాది మంది కళాకారులు ర్యాలీగా బయల్దేరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశాల క్రీడా మైదానానికి చేరుకున్నారు. ర్యాలీలో ముఖ్య ఆకర్షణగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. ఫుష్‌పుణి మహోత్సవ కమిటీ కార్యదర్శి ప్రముఖ కళాకారుడు ధిరెన్ మోహణ్ పట్నాయిక్ పర్యవేక్షణలో నిర్వహించిన ర్యాలీ పట్టణ ప్రజలను అమితంగా ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment