పేదలకు దుస్తులు పంపిణీ
రాయగడ: స్థానిక ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక అంబాగుడలోని తన స్వగృహం వద్ద సంక్రాతిని పురస్కరించుకుని పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఏటా ఈ తరహా సేవా కార్యక్రమాలను నిర్వహింటారు. అయితే ఈసారి ఎమ్మెల్యే హోదాలో ఈ కార్యక్రమం చేపట్టారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 350 మంది మహిళలు, రెండు వందల మంది పురుషులకు దుస్తులు అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
బోల్తా పడిన ఇసుక లారీ
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి జమ్ముగుడ వద్ద ఇసుక లారీ బోల్తా పడింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇసుక లోడ్‌తో టికిరి నుంచి శంకరాడ వెళ్తున్న లారీ అదపు తప్పడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలొ లారీ డ్రైవరు సురక్షితంగా బయట పడ్డాడు. అక్కడ ఉన్న స్థానికులు లారీలొ ఇరుక్కపొయిన డ్రైవరను బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. అధికవేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
రద్దీగా మాంసాహార మార్కెట్లు
రాయగడ: కనుమ పండగ సందర్భంగా బుధవారం రాయగడ మెయిన్ మార్కెట్ కిటకిటలాడింది మాంసం, చేపలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున జనం రావడంతో ప్రధాన రహదారి రద్దీగా కనిపించింది.
ప్రత్యేక అలంకరణలో
బలభద్ర, సుభద్రలు
జయపురం: జయపురంలోని జగన్నాథ మందిరంలో దేవతా మూర్తులు శ్రీజగన్నాథ, బలభద్ర, సుభద్రలను మకర చుడా వేశంలో అలంకరించి అన్న భోగతంలో పూజలు చేశారు. మందిర పూజారి వైధిక నీతి నియమాలతో శ్రీజగన్నాథ, దేవతా మూర్తులకు పూజలు నిర్వహించారు. అలాగే ఆ ప్రాంతంలో మరో ఆలయంలో ఉన్న వల్లభ నారాయణకు కూడా మకర సంక్రాంతి సందర్భంగా అందంగా అలంకరించారు. ఖండర సాహిలోని లక్ష్మీ నరసింహ మందిరంలో నరసింహ స్వామిని అర్చకులు ప్రత్యేకంగా అలంరించారు. పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మంత్రికి ఉపాధ్యాయుల వినతి
జయపురం: పర్మినెంట్ ఉపాధ్యాయులకు లభిస్తున్న సౌకర్యాలు తమకు కూడా వర్తింప చేయాలని బొరిగుమ్మ సమితి నాన్ పర్మినెంట్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన బొరిగుమ్మలోని సరస్వతీ శిశుమందిరం వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యాలయ, గణశిక్షా మంత్రి నిత్యానంద గోండ్‌ను కలిసి నాన్ పర్మినెంట్ ఉపాధ్యాయ సంఘం తరపున వినతిపత్రాన్ని సమర్పించారు. సంఘ బొయిపరిగుడ శాఖ అధ్యక్షులు అజిత్‌హోత్త, ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రాయ్, కోశాధికారి పద్మిణీ కుమార్ పండ, ఉపాధ్యాయురాలు సుస్మిత కుమారిపండ, నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సమన్వయ కమిటీ సలహాదారు బృంధావణ పండ, మహేశ్వర తండి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment